నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో హరిహరసుత అయ్యప్పస్వామి, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు మహేష్, నాగరాజు, జైపాల్ , రవి పాల్గొన్నారు.
