- ఆత్మీయ సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హామీ
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ లోని ఎన్ఎసి అకాడమీలో గంగారం సంగారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ నిర్వహించారు. ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా బాలకృష్, లోకేష్, అన్వర్, శ్రీనివాస్, భాస్కర్ ఎన్ఎసి అకాడమీలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, పి ఆర్ సి లేకుండా అన్యాయం జరుగుతుందని తెలిపారు. బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, ఎక్స్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి, మంత్రి ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర నలుమూలల నుండి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, అన్ ఎంప్లాయిస్ కు ఎలక్ట్రిషన్, ప్లంబర్, తాపీ మేస్త్రి , వెల్డింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం ఇండస్ట్రీస్ కి ఉద్యోగం చేసేందుకు పంపిస్తామని చెప్పారని, ఎన్ ఎ సి 350 మంది వర్కర్స్ హైదరాబాదులో 150 మంది, మిగతా జిల్లాలలో 200 మంది ఎంప్లాయిస్ ఉద్యోగం చేస్తున్నారని, ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ వర్కర్స్ కు చాలా ప్రాబ్లంగా బండి రమేష్ కి తమ గోడును వెలిబుచ్చారు. దీనికి బండి రమేష్ స్పందిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు దృష్టికి వెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నర్సింగరావు, తెప్ప బాలరాజు, అంజాద్, అమ్ము, సలీం భాయ్, మున్ ఆఫ్ ఖాన్, సత్య రెడ్డి, సిల్వర్ మనీష్, కాకర్ల అరుణ, రవీందర్, సత్తయ్య, రమణ, బిఆర్ యువసేన పాల్గొన్నారు.