- పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెట్టి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెట్టి జైపాల్ మల్లు రవి నివాసానికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పూలబొకే అందించి సన్మానించారు. నియోజకవర్గం నాయకులు జావీద్ హుస్సేన్, పోచయ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, నవీన్, కొండా తదితరులు పాల్గొన్నారు.