- ఆత్మీయ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ తెలిపారు. మియాపూర్ డివిజన్ బి కె ఎంక్లేవ్ వాసులతో సత్య రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా కాలనీ పెద్దలు చాలా సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, పార్కులు అభివృద్ధి చేయాలని కోరారు. ప్రదానంగా సర్వే నెంబర్ 44/4, 44/2, 44/5 లో ఉన్న కాలనీలు ప్రజా సిటీ, నాగార్జున ఎంక్లేవ్, బి కే ఎంక్లేవ్, మక్త, జన చైతన్య కాలనీ, సాయి కాలనీ, రెడ్డిస్ ఎంక్లేవ్, ప్రజా షెల్టర్ , సాయి జ్యోతి నగర్, చుట్టుపక్కన కాలనీలు లోన్స్ , నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. వీటిపై ఆయన స్పందిస్తూ సర్వే నెంబర్ 44 లో ఉన్న ముఖ్యమైన సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.
మీలో ఒక్కడిగానే ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ధనుంజయ, గోవర్ధన్ రెడ్డి, పాపిరెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, టి వి రావు , భూపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి మరియు బి.ఆర్ ఎంక్లేవ్ వాసులు , గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, సలీం, రవీందర్, సత్యారెడ్డి , అంజద్ అమ్ము , వెంకటరమణ, మునాఫ్, షరీఫ్ , గౌస్, బిఆర్ యువసేన పాల్గొన్నారు.