- ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ
- పాల్గొన్న ఎమ్మెల్యే జఫ్ఫార్ హుస్సేన్, కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి: రుచికరమైన, సుచికరమైన వంటకాలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెబానిస్ అల్తాజ రెస్టారెంట్ హైదరాబాద్ లోని మూడు చోట్ల తన బ్రాంచులను ఏర్పాటు చేసింది. డిఎల్ ఎఫ్, ఆసిఫ్ నగర్, కొండాపూర్ వద్ద నూతనంగా బ్రాంచులను గచ్చిబౌలి రడిసన్ హోటల్ వద్ద నాంపల్లి ఎమ్మెల్యే జఫ్ఫార్ హుస్సేన్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి వేర్చుల్ గా ప్రారంభించారు. అల్తాజ రెస్టారెంట్ తన బ్రాంచులను సిటీలో ఏర్పాటు చేయడం పట్ల హోం మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. హోటల్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్బంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ రెస్టారెంట్ లో రుచికరమైన కబాబ్ , షావర్మ లభిస్తుందని తెలిపారు. అన్ని చోట్ల తాజాగా నాణ్యత కలిగిన ఆహారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆన్సర్, ధూర్ష, హమీద్, సల్మాన్, ఫహాద, నాయకులు రెజి, బలింగ్ యాదగిరి గౌడ్, బుజంగం, ప్రసాద్, సతీష్ యాదవ్, శ్యామ్, లోకేష్, సునీల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.