కేటిఆర్ ఆలోచనలు నవీనం.. ఆచరణ వినూత్నం..: బండి రమేష్

  • బండి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ అల్విన్ చౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మియాపూర్ లోని బండి రమేష్ కార్యాలయం నుండి బాణాసంచా కాల్చుకుంటూ ఊరేగింపుగా అల్విన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నాయకులు, కార్యకర్తల, అభిమానులు ప్రజల సమక్షంలో కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆలోచనలు నవీనం.. ఆచరణ వినూత్నం.. అధునాతన టెక్నాలజీపై పరిజ్ఞానం అచంచలం. అభివృద్ధిలో అడుగులు విప్లవాత్మకం.. తెలంగాణ గడ్డకు ప్రపంచ దిగ్గజ కంపెనీలను రప్పించడంలో ఎదురులేని చాణక్యం.. ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కార మార్గాలు చూపడంలో విశేష నైపుణ్యం.. సేవా తర్పణంకు నిలువెత్తు నిదర్శనం.. చేపట్టిన పదవులకు సంపూర్ణ న్యాయం చేయగల సామర్థ్యం.. లోకల్‌ టు గ్లోబల్‌ ఏ విషయం పైన వేగంగా స్పందించే గుణం.. యువత భవిష్యత్తుకు ‘తారక’ మంత్రం.. నవ్యతకు నిలువుటద్దం.. మోడ్రన్‌ టెక్నాలజీ సారథి.. ఐటీకి వారధి మంత్రి కేటీఆర్ అని అన్నారు.

తండ్రికి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకుసాగుతున్న పర్ఫెక్ట్‌ లీడర్‌ ఆయన అని రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. కెసిఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ జై తెలంగాణ బండి రమేష్ నాయకత్వం వర్ధిల్లాలని అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, తెప్ప బాలరాజు ముదిరాజ్, శేఖర్ గౌడ్, నర్సింగ్ రావు, ధనుంజయ్, పి.మురళీధర్, భరత్, సిల్వర్ మనీష్, సలీం బాయ్, అంజద్ అమ్ము, మునాఫ్, మల్లికార్జున ముదిరాజ్, ఖాన్, షరీఫ్ బాయ్, సత్యారెడ్డి, రవీందర్ రావు, బిఆర్ యువసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here