మియాపూర్ లో రూ. 4.70 కోట్ల నిధులతో యూజీడీ పనులకు శంకుస్థాపన : ప్రభుత్వ ‌విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీలలో రూ.4.70 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులకు సోమవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ‌శంకుస్థాపన చేశారు. గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షాకాలం దృష్ట్యా పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్ , మహమ్మద్ కాజా, జంగిర్, సాయి యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కలిదిండి రోజా, సుప్రజా, వరలక్ష్మి, రాణి, లత, హన్మంతరావు, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, శివ ముదిరాజ్, ఉమాకిషన్, వెనకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్, అనిల్, దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, నర్సింగ్ రావు, సంతోష్, స్వామి నాయక్, కృష్ణ నాయక్, అశోక్, కిషోర్, నారాయణ రావు, తదితరులు ఉన్నారు.

మియాపూర్ లో‌ యూజీడీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here