నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఎంతో కాలం సాగవని జనసేన పార్టీ నాయకుడు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జి మాధవ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లిం సోదర సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక పవిత్ర బక్రీద్ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని చెప్పారు. అదేవిదంగా ఆసక్తిగల ముస్లిం యువకులు రాజకీయాలపై మొగ్గు చూపాలని కోరారు. ముస్లిం సోదరులకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్, ఇంతవరకు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని, ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతాలలో కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు.