నమస్తే శేరిలింగంపల్లి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ చౌరస్తాలోని మసీదులో ముస్లిం సోదరులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, మున్నా, కైసర్, ఖాసిం, ఖాజా సలీం పాల్గొన్నారు.
హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ హుడా కాలనీ, ఆదిత్య నగర్ లో మహమ్మద్ అలీ ఖాన్, మున్ ఆఫ్ ఖాన్, సలీం బాయ్, గౌస్ ఇంటికి వెళ్లి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదర సోదరీమణులందరికి బక్రీద్ పర్వదిన శుబాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు జి సంగారెడ్డి, నర్సింగ్ రావు, శేఖర్ గౌడ్, తెప్ప బాలరాజు ముదిరాజ్, అంజద్ అమ్ము, షరీఫ్, వెంకటరమణ, రవీందర్ రావు, బిఆర్ యువసేన పాల్గొన్నారు.