అత్యాధునికం.. సకల హంగుల కలబోత.. బాచుపల్లి మోడ్రన్ పోలీస్ స్టేషన్‌

  • పోలీసింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానం తెలంగాణదే: హోంమంత్రి మహమూద్ అలీ
  • అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో (రూ. 3.5 కోట్లు) నిర్మాణం
  • ఆధునిక సౌకర్యాలు, అత్యాధునికంగా మోడ్రన్ పోలీస్ స్టేషన్‌
  • 21,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 37 గదులతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పోలీస్ స్టేషన్
బాచుపల్లి మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ ను అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ ఎం. మదన్ మోహన్ రెడ్డి, మంత్రి చామాకూర మల్లారెడ్డి, శాసనసభ్యులతో కలిసి ప్రారంభిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ

నమస్తే శేరిలింగంపల్లి : పోలీసింగ్‌లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పోలీసులకు అన్ని అత్యాధునిక సదుపాయాలు, సామగ్రిని సమకూర్చారని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ సహకారంతో తెలంగాణలోని బాచుపల్లిలో 3.5 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆధునిక పోలీస్ స్టేషన్‌ను అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ ఎం. మదన్ మోహన్ రెడ్డి, మంత్రి చామాకూర మల్లారెడ్డి, శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ద్వారా పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నట్లు హోంమంత్రి తెలిపారు.

బాచుపల్లి మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ ప్రారంభం అనంతరం మాట్లాడుతున్నహోంమంత్రి మహమూద్ అలీ

అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఎం. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంస్థగా, మేము సామాజిక కార్యకలాపాలకు నిబద్ధతతో ఉన్నామని, సమాజ సంక్షేమానికి ఇలాంటి సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసకుని కొత్త పోలీస్ స్టేషన్ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు అవసరమైన భరోసా, భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. కొన్నేండ్లుగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ పోలీసు అధికారులకు అనేక విధాలుగా సహాయం అందిస్తున్నదని, కోవిడ్-19 సమయంలో పోలీసులకు పారిశుద్ధ్య సామగ్రి, మాస్క్‌లను అందించిందని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో CC కెమెరాలను ఏర్పాటు చేయడం, రోడ్‌ స్టాపర్‌లను అందించడం, పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాల అందించినట్లు పేర్కొన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లోని బాచుపల్లి ప్రాంతంలో ఆధునిక పోలీసు స్టేషన్‌ను నిర్మించాలని ముందుగా ప్రతిపాదించగా.. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి ముందస్తు అవసరాలను అర్థం చేసుకున్న అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని రూ. 3.5 కోట్లతో నిర్మించింది. బాచుపల్లి చెరువు పరిసరాల్లోని ఉరగుట్ట కొండపై ఉన్న ఈ అత్యాధునిక పోలీస్ స్టేషన్ 21,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 37 గదులతో నిర్మితమైంది. ఇందులో 10 ఎస్‌ఐ క్యాబిన్‌లు, 2 జైలు గదులు, పురుషులు, మహిళలకు రెండు పెద్ద విశ్రాంతి స్థలాలు, ఒక సెక్యూరిటీ గార్డు గది, రెండు అంతస్తుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) గదులు, ప్రత్యేకమైన విశ్రాంతి ప్రదేశాలు, టాయిలెట్‌లు, 2 రైటర్ రూమ్‌లు, రికార్డ్ రూమ్ ఉన్నాయి. ఒక CC కెమెరా గది, పురుషులు, స్త్రీలకు ఒక్కొక్కటి 10 టాయిలెట్లు, సరైన వంటగది, భోజన ప్రాంతం ఉన్నాయి.

బాచుపల్లి మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ ప్రారంభం అనంతరం..

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు, వాణీదేవి, శాసనమండలి సభ్యులు, సుంకరి రాజు, శంబీపూర్ రాజు, కె. నవీన్ రావు, కె.పి. వివేకానంద్, కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే ఎం. మదన్ మోహన్ రెడ్డి, టీఎస్పీహెచ్సీ చైర్మన్ కోలేటి దామోదర్, అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఎస్. సదానంద రెడ్డి, సీఎస్ ఆర్ హెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐసీఎస్., సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మొహంతి, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ టి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్., కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ రావు, నిజాంపేట్ మేయర్ నీల గోపాల్ రెడ్డి , మేడ్చల్ జెడ్పీ చైర్మన్ ఎం. శరత్ చంద్రారెడ్డి, శనిగల ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్సీ ఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, బాచుపల్లి ఇన్ స్పెక్టర్ నరసింహా రెడ్డి, ఇన్ స్పెక్టర్లు, ఇతర పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here