నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ఆశీర్వాదం పొందారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఇలాగే అందుబాటులో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితంతో, ప్రతి అడుగు ప్రజలకు మంచి జరిగేలా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగదీశ్వర్ గౌడ్ కి సూచించారు.