- ప్రత్యేక పూజలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి కాంటెస్ట్ అభ్యర్ధి గజ్జల యోగానంద్, రాష్ట్ర ఓ.బి.సి మోర్చా కార్యవర్గ సభ్యుడు ఉప్పల ఏకాంత్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ గ్రామం లోని ప్రశాంత్ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు రక్తపు లక్ష్మణ్ గౌడ్ గురు స్వామి, కుమారులు రక్తపు విక్రమ్ గౌడ్, రక్తపు శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో* అయ్యప్ప స్వామి పడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజక వర్గ బిజెపి కాంటెస్ట్ అభ్యర్ధి గజ్జల యోగానంద్, రాష్ట్ర బీజేవైఎం కోశాధికారి రఘునాథ్ యాదవ్, రాష్ట్ర బిజెపి ఓ.బి.సి మోర్చ కార్యవర్గ సభ్యులు ఉప్పల ఏకాంత్ గౌడ్, ఆయన సోదరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు మేడ్చల్ అర్బన్ జిల్లా ఎస్సీ మోర్చ సెక్రటరీ అశోక్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, రాజు, భాస్కర్, రాము, రణధీర్ పాల్గొన్నారు.