- అబ్బురపరచిన చిన్నారుల స్టెప్పులు
- అభినందించిన స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ రాజేందర్ రెడ్డి నగర్ లోని శివ్లీ స్కూల్లో తన పదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వేసిన స్టెప్పులు అందరినీ మైమరపించాయి. ముఖ్య అతిథులుగా డాక్టర్ జయధీర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపాల్ శిరీషా రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రామ చంద్రారెడ్డి చిన్నారులను అభినందించారు. చిన్నారుల్లో దాగిన వెలికి తీసేందుకు ఇదొక అద్భుతమైన వేదిక అని అన్నారు.
స%E