- బర్త్ డే విషెస్ తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్
జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొంతు శ్రీదేవి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మహిళలను చైతన్యవంతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మున్ముందు ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బొంతు శ్రీదేవి జన్మదినం సందర్భంగా మాజీ మేయర్ రామ్మోహన్ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సభ్యులు, యువజన నాయకులు, మహిళా సంఘాల నాయకులు, బీసీ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని బొంతు శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగారం మల్లికార్జున యాదవ్, సంఘం అధ్యక్షుడు మామిళ్ళ శ్రీనివాస్ యాదవ్, పాములేటి యాదవ్, అందెల కుమార్ యాదవ్ పాల్గొన్నారు.