నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి దాన కిషోర్ ఆదేశానుసారం నగరవ్యాప్తంగా 20 ఎన్జీవోల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పది రోజులపాటుగా డివిజన్ 15 వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ సహకారంతో కాలనీలో నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలి, నీరుంటే మనం ఉంటాం ..నీరు లేకపోతే మనం లేము, నీటిని ప్రతి ఒక్కరు సరియైన పద్ధతిలో వినియోగించాలి, ప్రజలు నీటిని ఉపయోగించి వినియోగించే, నిర్వహించే విధానాన్ని మార్చడానికి వారి వ్యక్తిగత జీవితం నుండే మార్పు రావాలని కోరారు. ప్రజాహిత వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కొండపల్లి జయశంకర్, సభ్యులు బొరపురెడ్డి పవన్ కుమార్, ఆదర్శ్, వాటర్ బోర్డ్ సభ్యులు, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, శ్రీకాంత్ , పుష్పమ్మ, శ్యామలమ్మ, గాలిమ్మ, ఎల్లమ్మ, రాములమ్మ, కమలమ్మ, నీలమ్మ, మల్లమ్మ, రుక్కమ్మ, నిర్మలమ్మ, పుల్లమ్మ, రేణుక, నూకలమ్మ, రుక్కు భాయ్, బాల్రాజ్ సాగర్, భువన్ డీజే, కృష్ణ, అశోక్, శ్రీను, రాజు, బాబు, ఎల్లయ్య, మానేయ, కాలనీ పెద్దలు యువజన నాయకులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.