- బీఆర్ ఎస్ పార్టీకి పార్టీ కార్యకర్తలే శ్రీరామ రక్ష
- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో కార్పొరేటర్ రోజాదేవి రంగరావుతో కలిసి వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. పరిపాలనా విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని, నేడు యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనకు నిదర్శనం అని, కోట్ల నిధులు వెచ్చించి శేరిలింగంపల్లి నియోజకవర్గను అభివృద్ధి చేసుకున్నామని, తప్పుడు కథనాలు సృష్టించే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం బీఆర్ ఎస్ పార్టీ అని, బీఆర్ ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటాం.. కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్ములని, బీఆర్ ఎస్ పార్టీ యే మనకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ పార్టీ ని బతికిస్తే అది మనల్ని బతికిస్తుందని, పార్టీ బాగుంటే మనం బాగుంటామని వివరించారు. ప్రజలకు పార్టీకి వారధిగా ఉండాలని, పదవులు రాని వారు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షులు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.