నమస్తే శేరిలింగంపల్లి : పరిశుద్ధమైన నీటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సేవ్ వాటర్ అనే నినాదంతో ర్యాలీగా బయలుదేరి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా అడుగు వేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మౌలిక వసతులలో భాగంగా ముందుచూపుతో రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా గోదావరి తదితర ప్రాంతాల నుంచి తాగునీటిని పంపిణీ చేయిస్తున్నారని తెలిపారు. తాగునీటి సమస్యను అధిగమించిన ఘనత కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, జయశంకర్, వెంకటేశ్వర్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రెటరీ హరి, ట్రెజరర్ మహేందర్, యోగి, కుమారి, కళ్యాణి, రోజారాణి, శశికళ, స్వరూప, సుజాత, కమళ, కాలనీవాసులు పాల్గొన్నారు.