- రూ. 20 లక్షల ఆస్తి నష్టం
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
- ఆదుకుంటామని హామీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామం రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద ఆటో మెకానిక్ షెడ్ లో అర్థరాత్రి 1.30 గంటలకు అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు, మెకానిక్ స్పేర్ పార్ట్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూ. 20 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటనా స్థలాన్ని డివిజన్ అధ్యక్షుడు, నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో మెకానిక్ షెడ్ లో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని, ఈ విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అనంతరం షాప్ ఓనర్స్ కి ప్రభుత్వం నుండి తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జహంగీర్, నియోజకవర్గ నాయకులు కృష్ణ యాదవ్, వెంకట్ రెడ్డి, అలీ, రషీద్, కళ్యాణ్, భారత్ గౌడ్, శ్రవణ్ పాల్గొన్నారు.