ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం బాధాకరం : ఎంపీ జి. రంజిత్ రెడ్డి

  • మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు

నమస్తే శేరిలింగంపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ప్రమాదం పట్ల చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి. రంజిత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మీయ సమ్మేళనం లో ఊహించని విధంగా సిలిండర్లు పేలి, ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవ్వడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందనీ, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందనీ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here