అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

  • పాల్గొన్న గంగాధర్ రెడ్డి దంపతులు
ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపనపల్లి గ్రామంలోని ఆడబిడ్డలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆడబిడ్డలు బోనాల కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు అని అన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజల అందరిపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని అన్నారు. తెలంగాణ సంస్కృతీసంప్రదా యాలకు ప్రతీక అయిన వన దేవతల పండుగల విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, బీజేపీ శ్రేణులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, భక్తులు, పిల్లలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here