- ఆయన వెంటే తన మిత్ర బృందం చేరిక
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కి చెందిన సీనియర్ నాయకుడు జుబేర్, తన మిత్ర బృందం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గువ్వల రమేష్ ఆధ్వర్యంలో తన మిత్ర బృందంతో తిరిగి సొంత గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ యువత చూపు బీఆర్ఎస్ వైపు అని, కాంగ్రెస్ పార్టీ వారు బూటకపు హామీలు, అమలు కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. మభ్య పెట్టి ప్రలోబాలకు గురి చేస్తూ పక్క పార్టీల వారిని పార్టీలో చేర్చుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితోలో కాంగ్రెస్ పార్టీ దిగజారిందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులు జుబేర్, అంజద్, అజీ, ఇర్ఫాన్, శభజ్, ప్రవీణ్, ఉదయ్, ఎస్ కే శమిర్, ఎస్ కే గౌస్, ఇంతియాజ్, ఎండీ. నజీర్, శ్రీనివాస్, రియాజ్, బషీర్, అక్బర్, రహీం, సాయి, శివ ప్రవీణ్ పాల్గొన్నారు.