నమస్తే శేరిలింగంపల్లి: సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జెరిపేటి జైపాల్ శేరిలింగంపల్లి డివిజన్లో గడపగడపకు తిరిగి కరపత్రాలను అందిస్తూ వివరించారు. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి హనుమాన్ దేవాలయం నుండి మొదలుకొని నల్లగండ్ల చౌరస్తా వరకు గడపగడపకు వెళ్లి తెలియజేశారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ పేద ప్రజలకు చాల ఉపయోగపడే ఆరు గ్యారంటీలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇచ్చిన గ్యారంటీలను సద్వినియోగ పరుచుకోవాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.