దేశ ప్రజలకు ప్రతినిధిగా.. సీఎం కేసీఆర్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ ను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పత్రిక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారని తెలిపారు. ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో.. ఈనాడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయమవుతాయని, దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు ఈనాటి బీఆర్ ఎస్ కార్యాలయ ప్రారంభం నాంది అని పేర్కొన్నారు. ఇది దేశ రాజకీయాల్లో కీలక మలుపు అని, తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ మరో ప్రస్థానం ఈ రోజు నుండి మొద‌లైందని, అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని తెలిపారు. భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసిందని, ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక లక్ష్యం సంక్షేమ భారతం అని వివరించారు. BJP కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు దేశ ప్రజలు విసిగిపోయిన సమయంలో కేసీఆర్ దేశానికి ఒక్క దిక్సుచి లాగా కనపడుతున్నారని, కర్ణాటక, మహారాష్ట్ర, వంటి సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్ర పథకాలు అక్కడ కూడా అమలైతే బాగుండు నని ఎంతో ఆశగా ఎదురుచుచుస్తున్నారని వెల్లడించారు. ఇలా దేశం మొత్తం కెసిఆర్ లాంటి నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని, దేశ ప్రజలకు ప్రతినిధిగా సీఎం ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here