- సాయంత్రం 6 గంటలకు “హరి కీర్తనా చందనం”
నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య జయంతిని అన్నమాచార్య భావనా వాహిని సంస్థ ఈ సారి కూడా వైభవంగా నిర్వహించనున్నది. 615వ అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని రేపు శనివారం సాయత్రం 6 గంటలకు “పద్మశ్రీ” పురస్కార గ్రహీత డా.శోభారాజు స్వర రూపకల్పనలో అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులతో “హరి కీర్తనా చందనం” నిర్వహించనున్నారు. పూజ్యశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి ఆశీ పూర్వక సందేశం అందజేయనున్నారు. “శ్యామ్ సింగరాయ్” కథా రచయిత సత్యదేవ్ జంగా ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లు ఫై ఆర్ ఓ రమణ గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, కార్యక్రమం అనంతరం అందరికీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు.