- ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని అపర్ణ గార్డెనియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్ ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగినదని, మానిఫెస్టోలో లేని అంశాలను కూడా ప్రవేశపెట్టినదని, ముస్లింల సంక్షేమానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ముస్లిం ప్రజానీకానికి ఆయన అండగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు