నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురుకులం అకాడమీ నృత్య ప్రదర్శన అలరించింది.
కూచిపూడి నాట్య గురువు కళాజ్యోతి, కళా నంది పురస్కార గ్రహీతలు పొపురి లక్ష్మి తులసి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.
వినాయక కౌతం, జయము జయము, సాధించవే మనసా, తక్కువేమి మనకు, చిదంబరేశ్వర నటరాజ, శివ తాండవం, జతిస్వరం, మరకత మణిమయ మొదలైన అంశాలను వేద, సత్య, రసజ్ఞ, కృతి, అనన్య, అధ్య, అలేఖ్య, శ్రీ భవ్య, శ్రీ వర్షిణిలు ప్రదర్శించి మెప్పించారు.