కనుల విందుగా నృత్యార్చన

నమస్తే శేరిలింగంపల్లి: పద్మశ్రీ .డాక్టర్. శోభారాజు సారధ్యంలో అన్నమయ్య సమేత శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నమ స్వరార్చనలో భాగంగా భాస్కర్ డాన్స్ అకాడమీ నృత్యార్చన గావించారు. నృత్య కళాకారులు డి.సాత్విక, లక్ష్మీ ప్రణతి, వైనవి, ధనిక్ష, రుచిక, మోక్షితలు గణపతి కౌతం, కొమ్మలాలా ఎంతవాడే, శివ కైవసం, దుర్గా చాలీసా, శ్రీ రఘు రాముని దివ్యకథ, అదివో అల్లదిహో, వచ్చెను అలమేల్మంగ, వందేమాతరం అంశాలు ప్రదర్శించారు. తదుపరి నృత్యార్చన చేసిన కళాకారులకు ఙ్ఞాపికతో సత్కరించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.కనుల విందుగా నృత్యార్చన పద్మ శ్రీ .డాక్టర్. శోభారాజు సారధ్యంలో అన్నమయ్య సమేత శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నమ స్వరార్చనలో భాగంగా భాస్కర్ డాన్స్ అకాడమీ నృత్యార్చన గావించారు. నృత్య కళాకారులు డి.సాత్విక, లక్ష్మీ ప్రణతి, వైనవి, ధనిక్ష, రుచిక, మోక్షితలు గణపతి కౌతం, కొమ్మలాలా ఎంతవాడే, శివ కైవసం, దుర్గా చాలీసా, శ్రీ రఘు రాముని దివ్యకథ, అదివో అల్లదిహో, వచ్చెను అలమేల్మంగ, వందేమాతరం అంశాలు ప్రదర్శించారు. తదుపరి నృత్యార్చన చేసిన కళాకారులకు ఙ్ఞాపికతో సత్కరించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.

అన్నమ స్వరార్చనలో నృత్యార్చన చేస్తున్న భాస్కర్ డాన్స్ అకాడమీ కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here