భాజపా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులుగా తోపుగొండ మహిపాల్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం, భెల్ ఎంఐజి ప్రాంతానికి చెందిన తోపుగొండ మహిపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో బూత్, వార్డు అధ్యక్షుడిగా, యువమొర్చ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా, బిజెపి కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా, అధికార ప్రతినిధిగా విధులు నిర్వహించారు. బుత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతం కొరకు కృషిచేశారు. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి సేవలను గుర్తించిన జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లు ఆయనను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామిస్తూ అధికారిక పత్రం అందజేశారు.

బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్ధాలుగా మహిపాల్ రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయమని అన్నారు. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి అర్బన్ పరిధిలో భాజాపా అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, రాష్ట్ర నాయకులు నందకుమార్ యాదవ్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తోపుగొండ మహిపాల్ రెడ్డికి నియామక పత్రం అందజేస్తున్న జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here