నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని సంస్థ అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారథ్యంలో అన్నమయ్యకు, వేంకటేశ్వర స్వామికి శనివారం గాయని ఒజ్జల అద్వితీయచే అన్నమచార్య స్వరార్చన కన్నుల విందుగా జరిగింది. ప్రతి వారం సంకీర్తనార్చన కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్వరార్చన శ్రోతల హృదయాంతరాలను తాకింది. ముదాకరా తమోదకం – గణేశ పంచరత్నం, చక్కని తల్లికి చాంగుభళా, ఆడరో పాడరో, అంతయు నీవే, అమ్మమ్మ ఏమమ్మమ, మాధవా కేశవా మధుసూదనా, రామచంద్రుడితడు, గోవింద గోవింద యని కొలువరే, నారాయణతే నమో నమో మొదలగు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. కీబోర్డ్ శాస్త్రి, తబలా నోవా వాయిద్య సహకారం అందించారు. సంకీర్తనా కార్యక్రమం అనంతరం డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు మంత్రాలని వాటిని అర్ధం చేసుకుని, భావం తెలుసుకుని పాడాలని విచ్చేసిన భక్తులందరికీ తెలిపారు. చివరిగా సంకీర్తనార్చన చేసిన కుమారి. ఒజ్జల అద్వితీయను , కళాకారులను సంస్థ ఙ్ఞాపిక, శాలువతో డాక్టర్ శోభా రాజు సత్కరించారు. అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వరస్వామికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.