ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా చూడాలి

  • సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పై డీసీపీ శ్రీనివాస రావు, IPS సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., ట్రాఫిక్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ట్రాఫిక్ రద్దీ సమయాలలో బాటిల్ నెక్ ప్రాంతాలలో TTF సిబ్బంది ఉండి ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కల్గకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వారికి కేటాయించిన రూట్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే అంశాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ట్రాఫిక్ రద్దీని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా క్యారేజ్ వే పార్కింగ్ లను తీయించడం, ఫ్రీ లెఫ్ట్ బ్లాకింగ్, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేలా చూడటం, జంక్షన్ ల వద్ద ఆటోలు తీయించడం వంటివి చేయడం వల్ల ట్రాఫిక్ సజావుగా సాగుతుందన్నారు. ఈ బైక్ లు అందరికి విజిబుల్ గా ఉండటం వల్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర ఉల్లంఘనలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, SHO లు, ADCP శ్రీనివాస్ రెడ్డి , మాదాపూర్ ట్రాఫిక్ ACP హనుమంత రావు పాల్గొన్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పై సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే అంశాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతున్న డీసీపీ శ్రీనివాస రావు, IPS సమీక్ష
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here