శిల్ప ఎంక్లేవ్ లో లక్ష దీపోత్సవం… ప్రారంభించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి…

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రతి ఏడు పవిత్రమైన కార్తీక మాసంలో ఆనవాయితీగా చేపడుతున్న లక్ష దీపోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక చందానగర్ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్న స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ యువి రమణమూర్తి తదితరులు

భక్తుల శివనామ స్మరణలతో శిల్పా ఎన్ క్లేవ్ ప్రాంతమంతా మార్మోగింది. ప్ర‌ధానార్చ‌కులు ప‌వ‌న‌కుమార శ‌ర్మ‌, ముర‌ళీధ‌ర శ‌ర్మ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మొదటిరోజు ఉత్స‌వాల‌లో స్థానిక భక్తులు శేషగిరి సువర్ణ దంపతులచే శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణ‌మూర్తి, క‌మిటి స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్‌, చెన్నారెడ్డి తదితరులు, శిల్పాఎన్‌క్లేవ్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసులు, ఆల‌య సేవాద‌ళం స‌భ్యులు, ప‌రిసర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ఉత్సాహంగా ప‌దివేల‌ దీపాలు వెలిగించారు.

లక్ష దీపోత్సవంలో మొదటి రోజు ఉత్సాహంగా పదివేల దీపాలను వెలిగిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here