నమస్తే శేరిలింగంపల్లి: అన్నమయ్య సమేత శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నమా స్వరార్చనలో మోహన మురళీ, ఆయన శిష్యులు గంట పాటు వేణువుతో సంకీర్తనార్చన చేశారు. మంతేన మురళి వేణువు ఊదగా.. శ్రీనిధి గాత్ర మందించారు. శిష్యులు శ్రియ, భాస్కర్ నందా, అనీష్, సంతాన శివాజీ, రయ్విత్, సర్గవి, అభినవ్, అభిరామ్, ప్రభంజన్, శ్రీ వత్సవ్, జాహ్నవి, శ్రీ వెంకట్, సుబ్బరాజు (ఆదిమూలమే, అదిగో అల్లదిగో, చక్కని తల్లికి, తిరుమలగిరి రాయ, మాధవా కేశవా, జగడపు చనవుల, తిరు తిరు జవరాల, చూడరమ్మ, తందనాన, పిడికిట, అన్నిమంత్రములు, శరణు శరణు) కీర్తనలు ఆలపించగా.. విష్ణువర్ధన్ వయోలిన్, అచ్యుతానంద్ మృదంగం వాయించారు. అనంతరం కళాకారులను పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు జ్ఞాపికతో సత్కరించారు. అన్నమయ్య సమేత శ్రీవేంకటేశ్వర స్వామికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.