- ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ డా.జి. రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా “అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్” ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ ను చేవెళ్ల ఎంపీ డా.జి. రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, అవుల రవీందర్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని, మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో “అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్” ఏర్పాటు అయిందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సేవ రూపంలో సరసమైన ధరలతో మెరుగైన వైద్య సేవలందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ CEO డా.ఎమ్ రమేష్ చంద్ర , మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిరియాల రాఘవరావు, కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, రామచంద్రారెడ్డి, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.