నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి 106 డివిజన్ లోని రైతు మార్కెట్ వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జైపాల్ మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను భావితరాలు ఆచరించాలని సూచించారు. అతి త్వరలో 106 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్ అభ్యర్ధన మేరకు విగ్రహ ఏర్పాటు చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ జయంతిని నిర్వహించిన సూర్య రాథోడ్ ను ఈ సందర్బంగా అభినందించారు. 124 కాంటెస్టెడ్ కార్పొరేటర్ మారెళ్ల శ్రీనివాస్, డివిజన్ సీనియర్ నాయకులు రాజేందర్, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ జహంగీర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజన్, పోచయ్య, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజీముదిన్, కవిరాజ్, శేఖర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.
