అంబేద్కర్ కు నిజమైన నివాళి బహుజన రాజ్యాధికారమే: తుకారాం నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతిని ఎంసిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో నిర్వహించారు. అనంతరం బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు తుకారాం నాయక్ పూలమాలవేసి నివాళు లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ ప్రజలకు మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహా నేత అంబేద్కర్ అని అన్నారు. భారతదేశం నేడు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి భారత రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతుందని కొనియాడారు. అంబేద్కర్ కి నిజమైన నివాళి బహుజనులు రాజ్యాధికారం లోకి రావడమే అని, యువకులు ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

ఎంసిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళు లు అర్పించిన ఎంసిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు తుకారాం నాయక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here