రాజ్యాంగ రూపశిల్పి, స్ఫూర్తి మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : దళిత నేత శ్రీనివాస్

నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నగరవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ లో దళిత నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని వారు రాసిన భారత రాజ్యాంగ సవరణ ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టిపిసిసి ఉపాధ్యక్షులు జరిపేటి జైపాల్, కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాండ్ర రమేష్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, నాయకులు అనిల్, కన్నా శ్రీనివాస్ గౌడ్, పార్నంది శ్రీకాంత్ ముదిరాజ్, హరీష్ రెడ్డి, అమిత్ దూబే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here