నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. మృతుడు 25-30 సంవత్సరముల వయస్సు కలిగ, నలుపు రంగు వెంట్రుకలు ఉండి చూడడానికి హిందువులా కనబడుతున్నాడు. ఒంటిపై గ్రే కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, బ్లాక్ రంగు ట్రాక్ ప్యాంటు విత్ రెడ్ లైన్ కలిగి ఉన్నాడు. మృతుని కుడిచేతికి మోచేయి భాగంలో ఒక ఎరుపు రంగు తాయత్తు ధారం, మనికట్టుకి మరొక ఎరుపు రంగు దారం కట్టబడి ఉన్నది. మృతదేహానికి బండరాళ్ళు కట్టి ఉండటంతో ఎవరైనా చంపి చెరువులో ముంచేశారా, లేక తానే ఆత్మహత్య చెసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అనుమానాస్పద మృతిపై వీఆర్ఏ నీరుడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నెంబర్లు 9490617191, 9491039032, 8331013199, 9490617100లలో సంప్రదించాలని సూచించారు.