నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్బంగా హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మెటల్ ఆర్ట్ వర్క్, బ్లాక్ ప్రింటింగ్ బెడ్ షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, కాశ్మీరీ శాలువాలు, చీరలు, ఎన్నో మరి ఎన్నో చేనేత హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. భాగంగా కర్ణాటక గాత్ర కచేరి లో USA నుండి విచ్చేసిన కళాకారిణి కుమారి అహి అజయన్ చాల శ్రావ్యంగా సాగింది. కందుల కూచిపూడి నాట్యాలయం రవి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన, సంజుక్త ఘోష్ సర్కార్ శిష్య బృందం చేసిన కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి.

