నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్, పాన్ మక్తా కాలనీల్లో కార్పొరేటర్ హమీద్ పటేల్ క్షేత్ర స్థాయిలో స్థానిక నాయకులతో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సిద్దిఖ్ నగర్ బస్తీలో HMWS మేనేజర్ యాదగిరితో కలసి బస్తీలో పాదయాత్ర చేస్తూ, స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు తెలుసుకొన్నారు. సిద్దిఖ్ నగర్ బస్తీలో మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి, తక్షణమే చర్యలు తీసుకొని పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
పాన్ మక్తా కాలనీలో జరుగుతున్న ఫుట్ పాత్ పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలిసి పనుల తీరును పరిశీలించారు. స్థానికులు లేవనెత్తిన పలు అభ్యంతరాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వాసులతో మాట్లాడి, వారికి అవగాహన కల్పించారు. ఎటువంటి ప్రజా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తో HMWS వాటర్ మేనేజర్ యాదగిరి, ఇంచార్జి నాయుడు, తెరాస సీనియర్ నాయకులు గౌరీ, సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, గణపతి, తెరాస పార్టీ యువ నాయకులు సాగర్ చౌదరి, నాగపూరి సురేష్ యాదవ్, నాగపూరి రాజు యాదవ్, జనార్దన్ యాదవ్, సాయి కుమార్, సైఫ్, మునీర్, మతిన్, ప్రవీణ్ యాదవ్, సాయి యాదవ్, ధనుజయ్ ఆనంద్ చౌదరి, విజయ్ కుమార్, శ్రీను, రవి యాదవ్, లింగారెడ్డి పాల్గొన్నారు.