- ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి తరలివెళ్లిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర కరీంనగర్, ఎస్.ఆర్.ఆర్ కాలేజ్ గౌండ్స్ లో జరగబోయే ముగింపు సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ కాన్వాయ్ తో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు , అభిమానులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు మార్గ నిర్దేశం చేసిన మహనీయుడని, అలాగే నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాదుకు విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ.. కెసిఆర్ నిరంకుశ, నియంతృత్వ, అవినీతి, రాచరికపు పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలని రాష్ట్రమంతటా ప్రజాసంఘాలయ యాత్ర చేస్తున్న నేపథ్యంలో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కాలేజ్ గౌండ్స్ లో జరగబోయే 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా రానున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగుల గౌడ్, ఎల్లేష్, రాధాకృష్ణ, అని కుమార్ యాదవ్, రమేష్, గోపాలకృష్ణ, బాలు, గణేష్, చంద్రశేఖర్, వరలక్ష్మి ,అరుణ మొదలగు పాల్గొన్నారు.