నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ లో చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. చెక్క మీద చెక్కిన విగ్రహాలు, దర్వాజాలు, స్తంభాలు, మట్టి తో తయారు చేసిన వంట సామగ్రి, పూల తొట్లు, మట్టి బొమ్మలు, వెదురుతో చేసిన లాంప్ షేడ్స్, బుట్టలు, పెన్ స్టాండ్స్, బనారసీ డ్రెస్ మెటీరియల్స్, సారీస్, కచ్ వర్క్ సంచులు, ఫరాదాలు, మరెన్నో ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం భరతనాట్య ప్రదర్శనలో కోలకతా నుండి విచ్చేసిన కళాకారులు ప్రొఫెసర్ దెబీజాని ఛటర్జీ బృందం ప్రదర్శన, లాస్యంగా డాన్స్ అకాడమీ గురువర్యులు రోహిణి కందాల శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.