- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్
- పాపి రెడ్డి కాలనీ లో యువ నాయకులతో కలిసి జనార్దన్ రెడ్డి విగ్రహానికి ఘన నివాళి
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, శాసనసభ పక్షనేతగా ,పేదల దేవుడిగా, కార్మికుల ఆశాకిరణంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు విశిష్ట సేవలందించిన పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్బంగా పాపి రెడ్డి కాలనీ లో కీర్తిశేషుడు పి.జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ నాయకత్వంలో యువ నాయకులు రామచందర్ రాజు, 106 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్ తో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా పి.జె.ఆర్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను విగ్రహ దాత బి.కొండల్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు మహానేతను కోల్పోవడం పార్టీకి తీరని లోటని జైపాల్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజేంద్ర, పోచయ్య, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ జహాంగీర్, యువజన కాంగ్రెస్ సౌదర్యం రాజన్, సురేష్ రాథోడ్, కవిరాజ్, రాజేష్, కిషోర్, చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అలీ, మైనారిటీ కాంగ్రెస్ అజీమ్, జావీద్, విద్యార్థి నాయకులు అశోక్, ప్రభు పాల్గొన్నారు.