నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలోని రైతు బాంధవులకు లక్ష రూపాయల రుణమాఫీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి రైతులు భారీ ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. ఇందులో భాగంగా హాఫిజ్ పేట్ డివిజన్ పరిధి మంజీరా రోడ్ లోని మిద్దెల మల్లారెడ్డి నివాసం ఎదుట కేసీఆర్ చిత్రపటం ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాబు మోహన్, మల్లేష్, సంకటి స్వామి, అనీఫ్ ఆప్తాబ్ పాల్గొన్నారు.