- స్వామివారిని దర్శించుకున్న పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంలో పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, నరేందర్ రాఘవుల ఇతరులతోపాటు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ స్వామి వారి కరుణ, కటాక్షాలు మనందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వీరిని రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్, బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ ఎస్.నందకుమార్ యాదవ్ సాదరంగా ఆహ్వానించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.