నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 330వ ఆరాధన మహోత్సవం వేడుకగా జరిగింది. దేవాలయ కమిటీ అధ్యక్షుడు పెరుసోముల బ్రహ్మం పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి దళిత ఐక్యవేదిక కన్వీనర్ ప్రొ.పి వై రమేష్ రంగారెడ్డి జిల్లా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు శోభన్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు చిన్నం సత్యం మారం వెంకట్ యం. ప్రభాకర్, చందానగర్ పాత్రికేయ మిత్రులు , దేవాలయం కమిటీ సభ్యులు, విశ్వకర్మ ఫౌండేషన్ శేరిలింగంపల్లి నియోజకర్గ కమిటీ సభ్యులు, పాపిరెడ్డి కాలనీ గాయత్రీ విశ్వకర్మ దేవాలయ కమిటీ సభ్యులు, దళిత ఐక్య వేదిక కమిటీ సభ్యులు, శేరిలింగంపల్లి రెడ్డి సంఘం కమిటీ సభ్యులు, చందానగర్ ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
