నమస్తే శేరిలింగంపల్లి: ఎస్ టీపీలో నీటి శుద్ధీకరణ పని వేగవంతంగా చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులకు ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని లింగంకుంటలోని ఎస్ టిపి నిర్వహణ, పని తీరును పరిశీలించి మాట్లాడారు. ఎస్ టిపి నిర్వహణ మెరుగుపర్చుకోవలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, వర్షం నేపథ్యంలో కరెంట్ పోయిన డీజిల్ ను ఉపయోగించి ఎస్ టిపి లో జరుగుతున్న నీటి శుద్దికరణ ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అకాల భారీ వర్షం నేపథ్యంలో వరద నీరు చేరడం వల్ల ఎస్ టిపి పై ఒత్తిడి పెరుగుతుందని, దానికి తగినట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 31 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు ఎస్ టిపి లకు నిధులు మంజూరి చేసిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరైన ఏడు ఎస్ టిపి మురుగు నీటి శుద్ధి కేంద్రాల వివరాలు
1. మియాపూర్ పటేల్ చెరువు 7.0 MLD capacity – 26.27 కోట్ల అంచనావ్యయం.
2. గంగారాం పెద్ద చెరువు – 20.0 MLD capacity – 64.14 కోట్ల అంచనావ్యయం.
3. దుర్గం చెరువు 7.0 MLD capacity – 25.67 కోట్ల అంచనావ్యయం.
4.కాజాగుడా చెరువు.- 21.0 MLD capacity – 61.25 కోట్ల అంచనావ్యయం.
5.అంబిర్ చెరువు 37.0 MLD capacity – 100.87 కోట్ల అంచనావ్యయం. 6.ఎల్లమ్మ కుంట చెరువు జయనగర్ – 13.50 MLD capacity – 43.46 కోట్ల అంచనావ్యయం. 7. పరికి చెరువు – 28.0 MLD capacity – 83.05 కోట్ల అంచనావ్యయం వెచ్చించారు.
త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, రాజశేఖర్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.