నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆత్మగౌరవ పతాక, ప్రగతి వైభవ ప్రతీక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. సిఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతోందని, అన్నివర్గాల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.