తిరుమల తిరుపతిలో 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణం

నమస్తే శేరిలింగంపల్లి: తులసమ్మ ఫౌండేషన్ నందనపాటి బ్రదర్స్, సోలీస్ కంటి ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నందనంపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో.. యుగ తులసి ఫౌండేషన్ అధినేత మాజీ టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నాద నీరాజనం మండపంలో 18న ఉదయం 10 నుండి (24 గంటలు) నిరంతర అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు రాఘవులు ప్రారంభించారు. కుషాయిగూడ లైన్స్ హాస్పిటల్ చైర్మన్, మాజీ కార్పొరేటర్, కొత్త రామారావు, శ్రీమాన్, చిన్న వీరాంజనేయులు, భజన రాజగోపాల్ నాయుడు, విజయేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, HB కాలని బీజేపీ నర్సింగ్, రాజశేఖర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here