నియోజక అభివృద్ధికి కృషి :ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • రూ. 2కోట్ల 45లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సీసీ రోడ్డు, యూజీడీ నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులకు ఆదేశించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహర్ ఫేస్ -1, నానక్ రాం గూడ SC బస్తీ, రాయదుర్గం, వినాయక నగర్ కాలనీలలో రూ. 2కోట్ల 45లక్షల అంచనా వ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణం పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

  • శంకుస్థాపన వివరాలు :

1.లక్ష్మీ విహర్ ఫేస్- 1 రూ.25 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం
2. నానక్ రాంగూడ SC బస్తీ లో రూ.21 లక్షల అంచనా వ్యయంతో యూజీడీ నిర్మాణం
3.రాయదుర్గంలో రూ.94 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం
4.వినాయక నగర్ లో రూ.1 కోటి 5 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, జంగయ్య యాదవ్, నరేష్, వినోద్, మల్లేష్, ఎండి ఇబ్రహీం, దాసరి గోపి, సతీష్, ఆకుల యాదగిరి, శ్రీకాంత్, వసంత కుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, అంజమ్మ, జగదీశ్, రమేష్ గౌడ్, గోవింద్, అక్బర్ బాయ్, నారాయణ, శ్యామ్లెట్ శ్రీనివాస్, ఖాదర్ ఖాన్, పామెటి రమేష్, హాసన్, నర్సింహా రాజు, రమేష్ గౌడ్, మాధవి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here