చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని చందానగర్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అధ్యక్షుడు తుడి ప్రవీణ్ ఆదివారం ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆమెను పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరగా అందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ తుడి, ఉపాధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి మాణిక్యాల రావు, కార్యనిర్వాహక కార్యదర్శి అంజద్, సభ్యులు సదయ్య, సలీం, సుబ్బారావు, సూరిబాబు, విజయ్, సతీష్ పాల్గొన్నారు.







